Home> వినోదం
Advertisement

Waltair Veerayya Day 13: పఠాన్ ఎంట్రీ ఇచ్చాక కూడా వాల్తేరు వీరయ్య జోరు.. ఎంత వసూలు చేసిందో తెలుసా

Waltair Veerayya Day 13 Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా 13 రోజుల కలెక్షన్స్ ఒకసారి పరిశీలిద్దాం. 

Waltair Veerayya Day 13: పఠాన్ ఎంట్రీ ఇచ్చాక కూడా వాల్తేరు వీరయ్య జోరు.. ఎంత వసూలు చేసిందో తెలుసా

Waltair Veerayya 13 Days Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే 13 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది.

ఇక రెండు వారాలు పూర్తి చేసుకోవస్తున్న ఈ సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తే మొదటి రోజు 20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు నుంచి నాలుగో రోజు వరకు 10 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఆ తర్వాత వసూళ్లలో క్రమంగా డ్రాప్ కనిపించింది.

దాదాపు 10 రోజు వరకు కోటి దాకా వసూలు చేసిన ఈ సినిమా 13వ రోజు మాత్రం దారుణంగా వసూళ్లలో డ్రాప్ కనిపించింది కేవలం 69 లక్షలు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయగలిగింది. ఇక రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా 13 రోజులకు గాను 98 కోట్ల 82 లక్షల షేర్ 160 కోట్ల 20 లక్షల గ్రాస్ వసూలు చేసింది.

ఇక అదే విధంగా కర్ణాటక సహా మిగతా భారతదేశం మొత్తం మీద 13 రోజులకు గాను ఏడు కోట్ల 64 లక్షల షేర్ ఓవర్సీస్ లో 12 కోట్ల 66 లక్షల షేర్ సాధించడంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 119 కోట్ల 12 కోట్ల షేర్ 14 కోట్ల 12 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా బిజినెస్ 88 కోట్లకు జరుపుకోవడంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్గా 89 కోట్లు నిర్ణయించారు దీంతో ఈ సినిమా 30 కోట్ల 12 లక్షల లాభాలతో దూసుకుపోతోంది. 

Also Read: Malikappuram Movie Review: మాలికాపురం మూవీ ఎలా ఉందంటే?  

Also Read: Balakrishna Controversy:మాకేం వివాదం అనిపించలేదు.. ఇక లాగకండి.. ఎస్వీ రంగారావు మనవళ్లు వీడియో రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 
Read More